calender_icon.png 17 October, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బంద్ కు సంపూర్ణ మద్దతు

16-10-2025 11:34:24 PM

మంచిర్యాల టౌన్ (విజయక్రాంతి): బీసీల 42 శాతం రిజర్వేషన్ కోసం ఈ నెల 18న తలపెట్టిన బంద్‌కు బిఆర్ఎస్ పార్టీ నైతిక మద్దతు  తెలుపుతుందని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాదే సత్యం వెల్లడించారు. గురువారం మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 18న బీసీ సంఘాలు జరపనున్న బంద్‌కు మంచిర్యాల నియోజక వర్గం బిఆర్ఎస్ పార్టీ తరపున పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు,  తదితరులు పాల్గొన్నారు.