calender_icon.png 6 May, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడి కేంద్రాలలో చేపట్టిన అభివృద్ధి పనులను నెలఖరులోగా పూర్తి చేయాలి

06-05-2025 08:33:11 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య..

హనుమకొండ (విజయక్రాంతి): జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో వివిధ వసతుల కల్పనకు చేపట్టిన అభివృద్ధి పనులను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య(District Collector P. Pravinya) అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత శాఖల అధికారులతో జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

అభివృద్ధి పనుల పురోగతిని గురించి జిల్లా కలెక్టర్ కు అధికారులు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ... అంగన్వాడీ కేంద్రాలలో చేపట్టిన విద్యుత్తు, తాగునీరు, టాయిలెట్స్ పనులను పూర్తి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఈజీఎస్ ద్వారా చేపట్టిన కిచెన్ షెడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణ రెడ్డి, ఇతర అధికారులు, సీడిపి ఓలు పాల్గొన్నారు.