calender_icon.png 6 May, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం లారీల‌కు ప్ర‌త్యేక సీరియ‌ల్ నంబ‌ర్ కేటాయించాల‌ని ఇంచార్జ్ తాసీల్దార్‌కు విన‌తి..

06-05-2025 08:40:09 PM

మునుగోడు (విజయక్రాంతి): మునుగోడు మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎత్తుకున్న లారీలకు ప్రత్యేకమైన సీరియల్ నంబరు కేటాయించాలని కోరుతూ మునుగోడు మండలం లారీ అసోసియేషన్(Munugode Mandal Lorry Association) సభ్యులు మంగళవారం ఇన్చార్జ్ తాహసీల్దార్‌ నేలపట్ల నరేష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. మునుగోడు మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇక్కడనే ఉన్న రైస్ మిల్లుకు ధాన్యాన్ని దిగుమతి చేసే అవకాశం కల్పించాలని, అయితే ఇక్కడ ధాన్యం ఎత్తుకున్న లారీలు మిల్లుకు చేరుకునే లోగా చండూరు, కనగల్లు, నల్లగొండ మండలాల నుంచి కూడా ధాన్యాన్ని ఎత్తుకున్న లారీలు ఇదే మండలానికి వ‌స్తున్న‌ట్లు తెలిపారు.