12-08-2024 01:19:10 AM
మంచిర్యాల, ఆగస్టు 11 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని కోల్ బెల్ట్ ప్రాంతమైన మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్‌గా జీ దేవేందర్, బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్‌గా ఎం శ్రీనివాస్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. నూతనంగా బాధ్యతలు స్వీకరిం చిన జీఎంలకు పర్సనల్ మేనేజర్‌లు, ఏరియా హెచ్‌వోడీలు, కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.