27-09-2025 04:37:42 PM
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పథకం ప్రకారమే ఎంజీబీఎస్(MGBS)ను ముంచారని, మూసీ ప్రాజెక్టు పూర్తి కోసమే రేవంత్ కిరాతకంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) మండిపడ్డారు. వరద హెచ్చరికలు ఉన్నా జలాశయల నుంచి నీరు వదల్లేదని, ఉద్దేశపూర్వకంగానే జంట జలాశయాల నుంచి నీరు వదల్లేదని కేటీఆర్ విమర్శించారు. మూసీ ప్రాంత వాసులకు భయపెట్టేందుకే ఒకేసారి 15 గేట్లు తెరిచారని, ఎన్నడూ లేనిది ఎంజీబీఎస్ బస్టాండ్ ఎందుకు మునిగిందని ధ్వజమెత్తారు.