calender_icon.png 19 August, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మంథని బలవీర హనుమాన్ ఆలయంలో భక్తుల సందడి

19-08-2025 07:05:11 PM

శ్రావణమాసంలో నిత్య పూజలు

మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ పరిధిలోని బోయినపేట గ్రామంలోని శ్రీ బల వీర హనుమాన్ దేవాలయం శ్రావణ మాసంలో భక్తుల సంఘర్షణతో పండుగ వాతావరణం నెలకింది. ఈ ప్రాంతంలో ఎంతో మహిమాన్వితంగా కలిగిన శ్రీ బలవీర హనుమాన్ దేవాలయానికి శ్రావణమాసంలోనే నాలుగు శనివారాలు 4 మంగళవారాల్లో ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జాతరలా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. బలవీర హనుమాన్ ప్రాముఖ్యత ఎంతో ప్రాచుర్యం పొందింది.

మంథనికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోయిన్ పేట గ్రామంలో స్వయంభుగా వెలసిన ఆంజనేయ స్వామి భక్తులపాలిట కొంగుబంగారంగా భక్తులు ఎంత విశ్వాసంతో దర్శించుకుంటారు. అనంతరం శ్రీ కాళికామాతను దర్శించుకుని భక్తులు పునీతులు అవుతారు. శ్రావణ శనివారం రోజున ఈ ఆలయంలో ఎక్కహం 24 గంటల పాటు ప్రజల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మంథని ప్రాంతంలో ఉండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో శ్రీ బలవీర హనుమాన్ ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.