calender_icon.png 19 August, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

పచ్చదనంతోనే ప్రజల ఆరోగ్యం

19-08-2025 07:08:57 PM

జర్నలిస్టు కాలనీలో హరితహారం

కమిషనర్ సమ్మయ్య

హుజురాబాద్,(విజయక్రాంతి): పచ్చదనంతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని మున్సిపల్ పరిధిలోని కేసి క్యాంపులో జర్నలిస్టు కాలనీలో మంగళవారం మున్సిపల్ ఆధ్వర్యంలో  హరితహారం కార్యక్రమం నిర్వహించారు.  జర్నలిస్టు కాలనీలో 100 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ... మొక్కలను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించడం మంచిదన్నారు.

మొక్కలను నాటడం వల్ల పర్యావరణం సమతుల్యత బాగుంటుందని అన్నారు. స్వచ్ఛ హుజురాబాద్ కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాయిత రాములు మాట్లాడుతూ.... పర్యావరణాన్ని కాపాడడానికి మున్సిపల్ చేస్తున్న అన్ని రకాల కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని అన్నారు. పచ్చదనం పెరగడంలో మా వంతు పాత్ర నిర్వహిస్తామని ఆయన అన్నారు.