27-10-2025 01:08:28 PM
నంగునూరు: మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఎండీ మహబూబ్ అలీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ఇంతకముందువిధులు నిర్వహించిన వేణుగోపాల్ స్టేట్ హోసింగ్ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ అయ్యారు. సిద్దిపేట రూరల్(Siddipet Rural) లో వివిధ హోదాలో పనిచేసిన ఎండీ మహబూబ్ అలీని నంగునూరుకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన నూతన బాధ్యతలను చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరేలా కృషి చేస్తానని,స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారుల సహకారంతో మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.అధికారులు,సిబ్బంది నూతన ఎంపీడీఓకు శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.