27-10-2025 01:11:42 PM
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న శ్రీధర్ బాబు
ఆరోపణలు చేస్తే ఊరుకోం
కరీంనగర్, (విజయక్రాంతి): పుట్ట మధూకర్(Putta Madhukar) అవినీతి చరిత్ర,, నేర చరిత్ర ప్రజలందరికీ తెలుసునని అంటూ లేనిదాన్ని సృష్టించి ఆరోపణలు చేస్తున్న పుట్ట మధూకర్ పై సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి(Suda Chairman Komatireddy Narender Reddy) ఫైర్ అయ్యారు. అవినీతి చరిత్ర నేర చరిత్ర కలిగిన పుట్ట మధూకర్ ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే వందల కోట్ల రూపాయలు సంపాదించారని అన్నారు. అటువంటి పుట్ట మధూకర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తూ రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్న శ్రీధర్ బాబు పై ఆరోపణలు చేస్తే ప్రజలే తరిమికొడతారని, కాంగ్రెస్ నాయకులం కూడా చూస్తూ ఊరుకోమని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హెచ్చరించారు.శ్రీధర్ బాబు కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక లేనిదాన్ని సృష్టించి అనవసర ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు.