27-10-2025 01:06:45 PM
రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజ్ ఠాకూర్
గోదావరిఖని,(విజయక్రాంతి): విద్యార్థుల సౌకర్యార్థం ఆధునిక సదుపాయాలతో కూడిన జూనియర్ కళాశాల నిర్మాణం చేపడతామని రామగుండం ఎమ్మెల్యే ఎం. ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. సోమవారం గోదావరిఖనిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం కోసం ప్రతిపాదిత స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, స్థానిక విద్యార్థుల సౌకర్యార్థం ఆధునిక సదుపాయాలతో కూడిన ప్రభుత్వ జూనియర్ కళాశాల త్వరితగతిన నిర్మాణం చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సింగరేణి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.