విద్యార్థులకు అల్బెండొజాల్ మాత్రల పంపిణీ
లక్షేట్టిపేట, జూలై 13: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని విద్యార్థులకు ఆల్బండోజల్ మాత్రలు అందజేసినట్లు పీ హెచ్ సీ డాక్టర్ సమత తెలిపారు. సోమవారం 10,500 మంది 19 ఏండ్లలోపు పిల్లలను గుర్తించి 90 శాతం మంది పిల్లలకు అల్బెండొజాల్ మాత్రలను అందజేశామన్నారు. మిగిలిన వారికి ఈనెల 20 న మాప్ అప్ డే రోజు మాత్రలను అందజేసి వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు.
ప్రతీ ఆరు నెలలకు ఒకసారి అల్బెండొజాల్ మాత్రలను ప్రభుత్వం అందజేస్తుందని,తప్పకుండా విద్యార్థులందరు తీసుకోవాల న్నారు. ఈ మాత్రలను తీసుకోవడం వల్ల విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం మరింత మెరుగుపడి ఉన్నతంగా ఎదిగేందుకు తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, ఎంపిడీఓ మధుసుధన్ , ఇంచార్జీ ఎంఈఓ శైలజ , హెచ్‌ఈఓ దేవేందర్, హెల్త్ సూపర్ వైజర్ శోభ, హెల్త్ అసిస్టెంట్లు గఫూర్ , వేణు , ఇసాక్ అహ్మద్, ఏఎన్‌ఎం సుజాత, ఆశావర్కర్స్ పాల్గొన్నారు.






