08-08-2025 12:22:05 AM
ఖమ్మం, ఆగస్ట్ 7 ( విజయ క్రాంతి): పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడానికి, ఆరోగ్యవంతమైన జీవనశైలి కోసం సైక్లింగ్ ప్రోత్సహించడంలో ఖమ్మం సైక్లింగ్ క్లబ్ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని ఖమ్మం జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రం సింగ్ అన్నారు. క్లబ్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన లోగో ఆవిష్కరణ, వృక్షార్పణ కార్యక్రమంలో విక్రమ్ సింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
క్లబ్ సభ్యులు తీసుకున్న ఈ ముందు చూపుతో కూడిన చర్యలు సమాజానికి ఎంతో ఉపయోగం అన్నారు. లోగో ఆవిష్కరణతో పాటు, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా వృక్షాలు నాటటం ఎంతో సంతోషకరం అన్నారు. ఈ తరహా కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షిస్తూ, ఖమ్మం సైక్లింగ్ క్లబ్ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు డా. మహేందర్, ఖమ్మం ఎఫ్‌ఆర్‌ఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.