calender_icon.png 8 August, 2025 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్య సిబ్బందికి పీపీఈ కిట్లను అందజేసిన ఎమ్మెల్యే గాంధీ

08-08-2025 12:22:39 AM

శేరిలింగంపల్లి, ఆగస్టు 7: శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్,గచ్చిబౌలి,శేరిలింగంపల్లి , డివిజన్ల  పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి శేరిలింగంపల్లి జోనల్ కార్యలయంలో  జోనల్ కమిషనర్   హేమంత్ బొర్ఖడే ,డీసీ శ్రీమతి శశిరేఖ , కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, ఏ ఏంఓహె  శ్రీకాంత్ రెడ్డిలతో కలిసి పారిశుధ్య సిబ్బందికి ఎమ్మెల్యే గాంధీ  పీపీఈ  కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ  మాట్లాడుతూ  పారిశుధ్య  సిబ్బంది  తల్లిదండ్రులతో సమానం అని , కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వారి సేవలు మరువలేనివన్నారు.