21-08-2025 01:34:20 AM
భీమదేవరపల్లి, ఆగస్టు 20 (విజయ క్రాంతి) : కాకతీయ విశ్వవిద్యాలయం సర్వోత్సవాల్లో భాగంగా తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ , కేయూ సంయుక్తంగా మంగళవారం ప్రారం భించిన మూడు రోజుల తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ఉత్సాహ భరితంగా ప్రారంభమైంది. హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన రామా రపు సంధ్యారాణిరాజు దంపతుల కుమార్తె ధనుశ్రీ,
ఈ కార్యక్రమంలో తన భరతనాట్య ప్రదర్శనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ధనుశ్రీ, మయూరి నాట్య కళాక్షేత్రం గురువు కుండే అరుణరాజ్ కుమార్ శిష్యురాలిగా నిత్యం కృషి చేస్తూ, తన నృత్యంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటోంది.
ఆమె ప్రతిభను గుర్తించిన కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి ప్రత్యేక అవార్డు అందించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఈసం నారాయణ, ఆల్ ఇండియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పుల్ల శ్రీనివాస్ ధనుశ్రీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఈ యువనర్తకి మరిన్ని విజయాలు లభించాలని వారు ఆకాంక్షించారు.