calender_icon.png 21 August, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోచమ్మ తల్లికి వెండి తొడుగులు చేయించిన ఎమ్మెల్సీ

21-08-2025 01:32:30 AM

హనుమకొండ, ఆగస్టు 20 (విజయ క్రాంతి): హనుమకొండ న్యూ శాయంపేటలోని పోచమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య దంపతులు 5 కిలోల 250 గ్రాముల వెండితో తయారుచేసిన అమ్మవారి తొడుగులను గురువారం బహుకరించనున్నారు.

న్యూ శాయంపేట గ్రామస్తులు, భక్తులు, కార్పొరేటర్ల సమక్షంలో వెండి తొడుగులను అమ్మవారికి సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శిరీష శ్రీమాన్, మామిండ్ల రాజు యాదవ్, మాజీ కార్పొరేటర్ మోహన్ రావు, వేల్పుల శివశంకర్ తదితరులు పాల్గొననున్నారు.