22-11-2025 10:55:26 PM
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడుగా పెద్దముల్ గ్రామ పంచాయితీ అనుబంధ గ్రామం పెద్దముల్ తండాకు చెందిన ధారాసింగ్ జాదవ్ నియమిస్తూ ఏఐసీసీ జారీ చేసిన జాబితాలో పేర్కొన్నారు.
అంచెలంచలుగా..
గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ధారాసింగ్ కు ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేదు. పార్టీకి సేవలు అందిస్తూనే ప్రజలతో మమేకమై ప్రజా నాయకుడిగా రెండు పర్యాయాలు పెద్దముల్ జడ్పిటిసి సభ్యుడిగా, ఓ పర్యాయం మండల పరిషత్ అధ్యక్షుడిగా కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా కూడా పార్టీని అంటిపెట్టుకొని అటు పార్టీ పెద్దలతో ఇటు కార్యకర్తలతో... ప్రజలతో ఉంటూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన పదవి చేపట్టారు. క్లీన్ ఇమేజ్ గా గుర్తింపు పొందిన ధారా సింగ్ నాయక్ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఎఐసిసి ఎంపిక చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.