22-11-2025 10:36:46 PM
సిద్దిపేట క్రైం: ఈనెల 24 నుంచి వచ్చే నెల 9 తేదీ వరకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని కమిషనర్ విజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘచే వారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.