calender_icon.png 22 November, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా సంజీవ్ ముదిరాజ్

22-11-2025 10:48:14 PM

అభినందనలు తెలిపిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి..

ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సంజీవ్ ముదిరాజ్ ను నియమిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దశబ్దల తరబడి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు నిరంతరం శ్రమించి ఏ పార్టీ అధికారంలో ఉన్న అటువైపు చూడకుండా నమ్మిన సిద్ధాంతాల వైపు అడుగులు వేస్తూ అందరి మన్ననలు పొందుతున్న సంజీవ్ ముదిరాజ్ కు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించడంతో పలువురు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు.

పార్టీని నమ్ముకుని ముందుకు అడుగులు వేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ మేలు చేస్తుందని చాటిచెబుతుందంటూ పలువురు కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా చెబుతున్న మాట. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, ఒలంపిక్ సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్పి వెంకటేష్ తదితరులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.