22-11-2025 10:51:16 PM
జనగామ (విజయక్రాంతి): జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా లకావత్ ధన్వంతినీ నియమిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దశబ్దల తరబడి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు నిరంతరం శ్రమించి ఏ పార్టీ అధికారంలో ఉన్న అటువైపు చూడకుండా నమ్మిన సిద్ధాంతాల వైపు అడుగులు వేస్తూ అందరి మన్ననలు పొందుతున్న లకావత్ ధన్వంతకి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పగించడంతో పలువురు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. పార్టీని నమ్ముకుని ముందుకు అడుగులు వేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ మేలు చేస్తుందని. ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.