22-11-2025 10:45:37 PM
ఐఎంటి హైదరాబాద్ తమ 2023-2025 బ్యాచ్ స్నాతకోత్సవ వేడుకను తమ క్యాంపస్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వోల్వో గ్రూప్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ కమల్ బాలి హాజరయ్యారు. ఐఎంటి హైదరాబాద్ పిజిపి చైర్‌పర్సన్ ప్రొఫెసర్ డాక్టర్ స్టీవెన్ రాజ్ పడకండ్ల, ఐఎంటి హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఎం బహరుల్ ఇస్లాం అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎంటి హైదరాబాద్ కొత్త సీఎస్ఆర్ కార్యక్రమం 'దైత్వ'ను పరిచయం చేయటంతో పాటు లోగోను కె ఎం బహరుల్ ఇస్లాం, కమల్ బాలి ఆవిష్కరించారు.
అనంతరం 2023-25 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ కోసం స్నాతకోత్సవ సావనీర్‌లను విడుదల చేశారు. ఐఎంటి హైదరాబాద్ వార్షిక నివేదికలోని ముఖ్యాంశాలను పంచుకున్నారు. బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్, పెప్సికో, డెలాయిట్ మరియు మైక్రాన్ టెక్నాలజీ వంటి 120 కి పైగా ప్రతిష్టాత్మక కంపెనీలలో తమ విద్యార్థులు ప్లేస్ మెంట్స్ దక్కించుకున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా వాతావరణ మార్పు, డిజిటల్ పరివర్తన, పెరుగుతున్న జాతీయవాదం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సహా సంక్లిష్టమైన ప్రపంచ సవాళ్లను గురించి కమల్ బాలి విద్యార్థులకు వెల్లడించారు. ఆవిష్కరణ, పారదర్శకత, స్థిరత్వాన్ని స్వీకరించడం ద్వారా ఉద్యోగ సృష్టి, పట్టణ-గ్రామీణ సమతుల్యత, పారిశ్రామిక అభివృద్ధి వంటి జాతీయ ఆవశ్యకతలను పరిష్కరించాలని ఆయన గ్రాడ్యుయేట్లను కోరారు. తమ లక్ష్యాలను అభిరుచితో అనుసంధానించుకోవాలని, సహకారాన్ని, సానుకూలతను పెంపొందించుకోవాలని, అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో చురుకైన అభ్యాసకులుగా ఉండాలని గ్రాడ్యుయేట్లకు సూచించారు. ఈ వేడుకల్లో 2023-2025 బ్యాచ్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 4 బంగారు పతకాలు, 3 వెండి పతకాలను ప్రధానం చేశారు.