22-11-2025 10:43:42 PM
నిర్మల్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే సీనియర్ కాంగ్రెస్ నేత వెడ్మా బొజ్జు పటేల్ నియమిస్తూ శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. డీసీసీ అధ్యక్షుడి పదవి కోసం నిర్మల్ జిల్లాలో ప్రస్తుత అధ్యక్షుడు కే శ్రీహరి రావు మాజీ జెడ్పిటిసి పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి సీనియర్ నాయకులు 20 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఖానాపూర్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పార్టీ అధిష్టానం చేయడంపై పార్టీలో చర్చ జరుగుతుంది.
డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకోనప్పటికీ పార్టీ ఖానాపూర్ ఎమ్మెల్యేకు జిల్లా పగ్గాలు అప్పగించడంపై కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు కొందరు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. 2003 అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే బుజ్జు పటేల్ ఒక్కరే విజయం సాధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నితుడిగా పేరున్న ఖానాపూర్ ఎమ్మెల్యేగా అనూహ్యంగా ఎంపిక చేయడంపై రాజకీయ దుమారం లేపుతోంది. జూడు పదవులు ఇవ్వబోమని ప్రార్థించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యేకు డీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.