calender_icon.png 22 November, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానుకోట డీసీసీ అధ్యక్షురాలిగా ఉమా మురళి నాయక్

22-11-2025 10:58:53 PM

విధేయతకు దక్కిన అవకాశం..

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఏఐసీసీ శనివారం రాత్రి ప్రకటించిన తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల డీసీసీ అధ్యక్షుల నియామకంలో మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా డాక్టర్ భూక్య ఉమ మురళి నాయక్ పేరు ప్రకటించారు. మహబూబాబాద్ తొలి మున్సిపల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ ఉమా మురళి నాయక్ డిసిసి అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఉమ భర్త డాక్టర్ భూక్యా మురళి నాయక్ ఎమ్మెల్యేగా ఎన్నికవ్వగా, సతీమణి ఉమ డీసీసీ పగ్గాలు చేపట్టడం విశేషంగా మారింది. ఉమ గతంలో ఏఐసీసీ కార్యదర్శి గా బాధ్యతలు నిర్వహించారు. పార్టీకి విధేయులుగా ఉమా మురళి నాయక్ దంపతులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మురళి నాయక్ తండ్రి మంగ్యా నాయక్ కాంగ్రెస్ నుండి మహబూబాబాద్ జెడ్పిటిసిగా ఎన్నికయ్యారు.