సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా
సంఘీభావం తెలిపిన మేయర్, డిప్యూటీ మేయర్
ముకరంపుర, జూలై 13(విజయ క్రాంతి) కరీంనగర్ జిల్లాలో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. కార్మికులకు అండగా ర్యాలీ లో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం కార్మిక సంఘాల ప్రతినిధులతో కలసి జిల్లా కలెక్టర్ చిత్రామిశ్రా కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్ లు మాట్లాడుతూ ఈఎస్‌ఐ ఆసుపత్రికి సంబంధించి బండి సంజయ్ కుమార్ ఇచ్చిన హామీ మేరకు తప్పకుండా ఆ కార్యక్రమాన్ని చేపడతామని కానీ కార్మిక భవన నిర్మాణానికి స్థలం మరియు నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు.ప్రమాదవశాత్తూ మరణించిన ప్రతి కార్మికుడికి 5 లక్షల రూపాయలు, ప్రస్తుతం 60 ఏళ్ల వరకు ఇస్తున్న లేబర్ కార్డు గడువును 70 ఏళ్ల వరకు పెంచాలనే మొదలగు డిమాండ్లు సరియైనవేనని ఇట్టి డిమాండ్లు నెరవేరే అంతవరకు కరీంనగర్ లోని కార్మికులందరికీ మీము మా పార్టీ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా భవన నిర్మాణ కార్మిక ఐక్య సంఘం జేఏసీ సభ్యులు చాడ ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.






