calender_icon.png 19 May, 2025 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్లను అప్పగించాలని ధర్నా

19-05-2025 05:53:01 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో పేద ప్రజల కోసం ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలని లబ్ధిదారులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. దీనికి సిపిఎం సిపిఐ ఎంఎల్ పార్టీ సభ్యులు రాజు మద్దతు పలికి పేద ప్రజలకు ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. కేటాయించకపోవడం వల్ల కొత్త భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని వెంటనే కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు.