calender_icon.png 19 May, 2025 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుందరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమించాలి

19-05-2025 05:44:16 PM

సిపిఎం, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ, రణపంగ కృష్ణ..

పెన్ పహాడ్: ఆదర్శ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని, ఆయన స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వాలపై ఉద్యమించాలని సిపిఎం, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ, రణపంగ కృష్ణ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని నాగులపాటి అన్నారం, లింగాలలో వేరువేరుగా ఏర్పాటు చేసిన పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్రోద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించడమే కాకుండా వీర తెలంగాణ, సాయుధ రైతాంగ పోరాటంలో పీడిత ప్రజల కోసం తన ఆస్తులు భూములను దానం చేసి సమాజం కోసం పిల్లల్ని కూడా వద్దనుకున్న ఆదర్శనేత పుచ్చలపల్లి సుందరయ్య అన్నారు.

అగ్రకులంలో పుట్టినప్పటికీ వివక్షకు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి దళిత చేత ఆలయ ప్రవేశాలు చేయించి, సహపంక్తి భోజనాలు నిర్వహించిన ఆదర్శ నేత సుందరయ్య అని కొనియాడారు. నీటి వనరులను వినియోగం, భూమిపై ఉన్న సహజ వనరులు ప్రజలందరివని సంపద వికేంద్రీకరణ జరగాలని దున్నేవాడికే భూమి ఇవ్వాలని ప్రజల కోసం భూ పోరాటాలు చేసిన మహోన్నత నేత సుందరయ్య స్ఫూర్తితో ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు లేని సమాజం కోసం చేసే పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ కార్యదర్శి ఐతబోయిన సత్యం, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ధనియాకుల శ్రీనివాస్, నాయకులు అయితబోయిన వెంకన్న, నకిరే కంటి సత్యం, గర్నె నాగరాజు, నకరికంటి నరసయ్య, దొంతగాని వీరస్వామి, సుంకరబోయిన సందీప్, మల్లయ్య, వెంకటేశ్వర్లు, రాములు, బిక్షం, దుర్గయ్య, వెంకన్న, సైదులు, అనిల్, జగపతి, గురువయ్య, భిక్షం, మధు తదితరులు పాల్గొన్నారు.