30-12-2025 12:07:54 AM
ఆటతోనే సెలక్టర్లకు సవాల్
రాజ్‌కోట్, డిసెంబర్ 29 : న్యూజిలాండ్ తో సిరీస్‌కు జట్టు ప్రకటనకు ముందు యువ క్రికెటర్లు విజయ్ హజారే ట్రోఫీలో దుమ్మురేపుతున్నారు. తాజాగా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ మెరుపు శతకంతో రెచ్చిపోయాడు. విజయ్ హజారే ట్రో ఫీలో ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జురెల్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. బరోడా బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా దూకు డైన బ్యాటింగ్‌తో రెచ్చిపోయాడు. కేవలం 78 బంతుల్లోనే తొలి లిస్ట్ ఏ క్రికెట్ శతకం సాధించాడు. ఆ మ్యాచ్‌లో మొత్తం 101 బం తులు ఆడిన జురెల్ 15 ఫోర్లు, 8 సిక్సర్లతో 160 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.