12-02-2026 12:00:00 AM
వృద్ధ ఓటర్ లతో మాట్లాడిన పెద్దపల్లి డీసీపీ, గోదావరిఖని ఏసీపీ రమేష్
మంథని, ఫిబ్రవరి11(విజయ క్రాంతి) మంథని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్ర భుత్వ బాలుర హై స్కూల్, గురుకుల హై స్కూల్ మంథని, పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చిన వృద్ధురాల్లతో పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ వృద్దురాల్లని ని ఆప్యాయం గా పలకరించి ఓటు వేసావా అమ్మా అని, పోలింగ్ కేంద్రలోకి వెళ్ళడానికి పోలీస్ వారు సహాయం చేశారా,
ఆరోగ్య పరిస్థితి బాగుం దా అని మానవత్వంతో అడిగి తెలుసుకొన్నారు. పోలీసులు ఎప్పుడూ ప్రజలకు సహా యంగా ఉంటారని, ప్రజలందరూ ఎటువం టి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని డీసీపీ రాంరెడ్డి సూచించారు.