27-07-2025 12:53:30 AM
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన పాన్ ఇండియా యాక్షన్ చిత్రం ‘కూలీ’. ఇందులో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమిర్‌ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతిహాసన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు, డీ సురేశ్‌బాబు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 14న విడుదల కానుందీ సినిమా. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రుతిహసన్ విలేకరులతో చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే..
-నిజంగా రజనీకాంత్‌ది, మా నాన్న కమల్‌హాసన్‌ది యూనిక్ బాండింగ్. వాళ్ల రోజులు, స్నేహం, ఆ వర్కింగ్ స్టుల్ గురిం చి చాలా విషయాలు నాన్నా నాతో షేర్ చేసుకున్నారు. అలాంటి -రజినీకాంత్‌తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా.
-ఈ సినిమాలో నాది స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్. చాలా మంచి ఎమోషన్ ఉంటుంది. డైరెక్టర్ చాలా అద్భుతంగా డిజైన్ చేశా రు. అమ్మాయిగా ఆ క్యారెక్టర్‌కు నేను చాలా కనెక్ట్ అయ్యాను. అమ్మాయిలు చాలా కనెక్ట్ అవుతారు.
-నేను ఈ సినిమాలో సత్యరాజ్ అమ్మాయిగా కనిపిస్తా.
-నాగార్జున, ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర.. ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు. వాళ్లందరితో స్క్రీన్ షేర్ చేసుకోవడం -అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పటివరకు చాలా మంది స్టార్స్‌తో కలిసి పనిచేశాను. ఇంత మంది సూపర్ స్టార్స్‌తో ఒకే సినిమాలో పనిచేసే అవకాశం అందరికీ దొరకదు.
-నాగార్జున ఫస్ట్ టైమ్ విలన్ క్యారెక్టర్ చేశారు. తెలుగు ఆడియన్స్ అందరు చాలా సర్‌ప్రైజ్ అవుతారు. ఆమిర్‌ఖాన్‌తో నాకు సీన్స్ ఉంటాయి. ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్. నా లైఫ్‌లో ఒక ఇంపార్టెంట్ ఫేజ్ ఆయన ఫ్యామిలీ తోడుగా ఉంది.
-నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. కానీ, మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నేను కూడా ఒక మ్యుజిషియన్‌ని. ఎప్పుడైనా ఒక మ్యుజిషియన్ రోల్ ప్లే చేయాలనుంది.
-చాలా లాంగ్ కెరీర్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా ఈ జర్నీ అం తా బ్లెస్సింగ్ అని భావిస్తున్నా. నేను వర్క్‌ను ఎంజాయ్ చేశా ను. భవిష్యత్తు గురించి ఎక్కు వ ఆలోచించలేదు. నా అదృష్టంతా ముందున్న ప్రాజెక్టుకు ఎంతవరకు న్యాయం చేయగలననే దానిమీదే ఉంటుంది.
-లాస్ట్ ఇయర్ అంతా కూలీతోనే బిజీగా ఉన్నా ను. ఇప్పుడు కథలు వింటు న్నాను. కొత్త డైరెక్టర్స్, కొత్త రైటర్స్, అందరితో కలిసి పనిచేయాలనే ఆసక్తి ఉంది. తెలుగులో కొన్ని స్టోరీస్ విన్నాను. త్వరలోనే అనౌన్స్‌మెంట్ ఉంటుంది.