27-07-2025 12:54:39 AM
యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ ఇండస్ట్రీ ఔట్‌సైడర్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. “ఇండస్ట్రీలో మళ్లీమళ్లీ అవకాశాలు రావు. ఈరోజు ఓ సినిమా.. రేపు మరో సినిమా. ఆ తర్వాతి సినిమా కోసం చాలా కష్టపడాలి. ఎందుకంటే నీ సినిమాలతో మొదటి రెండు సార్లు తప్పు చేస్తే నీ పని అయిపోయి నట్టే. అదే రియాలిటీ. అందువల్లే కథ పట్ల, మీ పాత్రల పట్ల పూర్తి స్థాయిలో నమ్మకం ఉండాలి” అని చెప్పుకొచ్చింది.