calender_icon.png 16 October, 2025 | 5:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశాభివృద్ధిలో డిజిటలైజేషన్ కీలకం

16-10-2025 01:06:33 AM

  1. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించాం 

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ 

డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్‌ను ప్రారంభించిన గవర్నర్

మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి విద్యా సంస్థల క్యాంపస్‌లో నిర్వహణ

మేడ్చల్, అక్టోబర్ 15(విజయ క్రాంతి): దేశాభివృద్ధిలో డిజిటలైజేషన్ కీలకమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్ట్టిట్యూషన్స్ వారు గూగుల్‌తో డిజిటల్ ఒప్పందం డిజిటల్ క్యాంపస్ ఆఫ్ గూగుల్ క్లౌడ్ కార్యక్రమాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జ్యోతి ప్రజ్జల్వన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ దేశం లో శాస్త్ర సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.

మల్లారెడ్డి విద్యాసంస్థలు గూగుల్‌తో ఒప్పందం చేసుకోవడం అభినందనీయమన్నారు. దీనివల్ల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయ న్నారు.  ఈ సందర్భంగా మల్లారెడ్డి విద్యా సంస్థలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను ఎంతో ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్ర మంలో గూగుల్ సంస్థ ప్రతినిధి వైభవ్ కుమార్ శ్రీ వాస్తవ, సిద్ధార్థ దళ్వాడి, మల్లారెడ్డి విద్యాసంస్థల చైర్మన్, ఎమ్మెల్యే చామ కూర మల్లారెడ్డి, వైస్ చైర్మన్ భద్రారెడ్డి, డాక్ట ర్ ప్రీతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా మల్లారెడ్డి విద్యాసంస్థలు గూగుల్ తో ఒప్పం దం చేసుకోవడం వల్ల రాబోయే రోజుల్లో 50 వేల మంది విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు, ఏఐ ఆధారిత విద్యా పద్ధతులు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యాసంస్థల సర్టిఫికెట్లు అందించబడతాయి.