16-10-2025 01:07:32 AM
-ఈ నెల 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు
-ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం, అక్టోబర్ 15(విజయక్రాంతి) : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని ఖమ్మం పోలీ స్ కమిషనరేట్ పరిధిలో ఔత్సహిక ఫొటోగ్రాఫర్లకు ఫొటోగ్రఫీ, అదేవిధంగా షార్ట్ ఫిల్మ్‌కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీ స్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సు నీల్ దత్ తెలిపారు.
ఇందుకు సంబంధించి పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడించారు. పోలీస్ అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరి స్తూ ఈనెల 21 నుంచి 31 వరకు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందు లో భాగంగా పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే ఇటీవల కాలంలో తీసిన మూడు ఫొటోలు, తక్కువ నిడివి (3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్రస్థాయి పోటీల కోసం ఈనెల 22వ తేదీలోపు ఖ మ్మం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సంబంధిత షార్ట్ ఫిల్మ్ లోడ్ చేసిన పెన్ డ్రైవ్, 10 x 8 సైజ్ ఫొటోలనుపెన్ డ్రైవ్‌లో అందజేయాలని సూచించారు. వివరాల కోసం 8712659 256 నెంబర్ ద్వారా పీఆర్‌ఓ ను సంప్రదించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.