01-07-2025 12:00:00 AM
“కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కి ఇండస్ట్రీలోకి రావాల ని ఉంటుంది. వాళ్లకు సరైన గైడెన్స్ ఉండ దు. అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుంద ని అనుకుప్పుడు వచ్చిన ఆలోచనే ఈ ‘దిల్ రాజు డ్రీమ్స్’. ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి సరైన వేదిక అవుతుందనే ఈ వెబ్‌సైట్‌ను లాంచ్ చేస్తున్నాం” అన్నారు నిర్మాత దిల్ రాజు. ‘దిల్ రాజు డ్రీమ్స్’ వెబ్‌సైట్ లాంచ్ ఈవెంట్ హైదారాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథులు గా హాజరైన హీరో విజయ్ దేవరకొండ, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ చేతుల మీదుగా ఈ వెబ్‌సైట్‌ను ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా విజయ్ దేవర కొండ మాట్లాడుతూ.. “13 ఏళ్ల క్రితం పొద్దున లేచిన వెంటనే ఎక్కడైనా కాస్టింగ్ కాల్స్ ఉన్నాయా? అని చెక్ చేసుకునేవాడిని. ఆ రోజుల్లో ఇంత ఇంటర్నెట్, సోష ల్‌మీడియా లేదు.
శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా కాస్టింగ్ కాల్ చూసి, దానికి అప్లు చేశాను. దాదాపు 6 నెలలు టెన్షన్ పడ్డాను. ఆ టెన్షన్ కూడా ఒక తృప్తినిచ్చేది. ఒక ప్రయ త్నం చేస్తున్నాం. ఒక అవకాశం ఉందనే ఆనందం ఉండేది. 16 వేల అప్లికేషన్స్ ఆ సినిమాకు వచ్చాయి. 11 మందిని సెలెక్ట్ చేశారు. అందు లో నేనూ ఉన్నాను.
ఆ సిని మా నా జీవితంలో పెద్ద రోల్‌ని ప్లే చేసిం ది. ఒక అవకాశం ఎంత గొప్పదో నాకు తెలుసు. ‘దిల్ రాజు డ్రీమ్స్’ను లాంచ్ చేయాలని దిల్ రాజుకు ఎందుకు అనిపించిందో నాకు తెలియదు కానీ ఇది లక్షలాది మందికి ఒక నమ్మ కం ఇచ్చింది. ఇందులో ఒక్కరి కల నెరవేరినా ఈ వెబ్‌సైట్ లాంచ్ చేయడానికి న్యాయం జరిగినట్టే” అన్నారు. దేవిశ్రీప్రసాద్, నిర్మాత శిరీష్, పలువురు చిత్రపరి శ్రమ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.