calender_icon.png 1 July, 2025 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద ప్రజల సొంతింటి కల నిజం చేస్తాం

01-07-2025 01:06:03 AM

 ఆత్మ కమిటీ చైర్మన్ వై ప్రభు

కొండాపూర్, జూన్ 30 :  కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తుందని ఆత్మ కమిటీ చైర్మన్ వై ప్రభు అన్నారు. సోమవారం కొండాపూర్ మండలం పరిధిలోని తెర్పోల్ గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన వారికి ప్రొసీడింగ్ లు  అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లు లేని వారిని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య, సదాశివపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సడాకుల కుమార్, కొండాపూర్ మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ రాజు, పంచాయతీ కార్యదర్శి పార్టీ నాయకులు గ్రామస్తులుపాల్గొన్నారు.