calender_icon.png 4 August, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కీచక ఉపాధ్యాయుడి సస్పెండ్

05-12-2024 11:53:59 PM

దోమల గూడ పోలీస్ స్టేషన్‌లో వారం రోజుల క్రితం కేసు 

హైదరాబాద్,(విజయక్రాంతి): విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారి విద్యార్థినులను వేదిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముషీరాబాద్ మండలం దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ కీచక ఉపాధ్యాయుడిపై డీఈవో ఆర్.రోహిణి కన్నెర్రజేశారు. జీ.సురేష్ అనే కీచక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సదరు కీచక ఉపాధ్యాయుడు ఆ పాఠశాలలోని పలువు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో వారం రోజుల క్రితం బాధిత విద్యార్థినులు, తల్లిదండ్రులు దోమలగూడ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినట్లు తెలిసింది. కాగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు. కాగా ఆ ఉపాధ్యాయుడు ప్రస్తుతం డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నాడని, గతంలో పని చేసిన పాఠశాలల్లో కూడా ఇలాంటి ఘటనలకు కారణమయ్యాడని అతనిపై ఆరోపణలున్నాయి.