22-08-2025 02:06:20 AM
సచివాలయం మీడియా పాయింట్‌లో జాజుల
హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): నెలరోజులపాటు సాగిన పార్లమెం ట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అం శంపై కనీసం చర్చ జరగకపోవడం అత్యంత బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. అడగాల్సిన ఇండియా కూటమి మాట్లాడకుండా, బాధ్యత గల ఎన్డీ యే కూటమి స్పందించకుండా బీసీలకు అన్యాయం చేశాయని ఆగ్రహించారు.
గురువారం సచివాలయం వద్ద మీడియా పా యింట్‌లో ఆయన మాట్లాడారు. రాష్ర్ట ప్రభుత్వం విద్య, ఉద్యోగ, రాజకీయ రం గాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెం చుతూ అసెంబ్లీలో చేసిన బిల్లును కేంద్ర ప్ర భుత్వానికి పంపించిన తర్వాత రెండు సార్లు ఢిల్లీలో పెద్ద ఎత్తున బీసీల ధర్నా జరిగినప్పటికీ కనీసం పార్లమెంట్‌లో చర్చిం చకపో వడం, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం బాధాకరమన్నారు.
దీనిని బట్టి ఇరువురికీ బీసీల పట్ల చిత్తశుద్ధి లేదనే సందేహం నెలకొన్నదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభలో వాయి దా తీర్మానాన్ని కోరి అడపాదడపా చేపట్టిన ఆందోళనలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ పాల్గొనలేదని, కాంగ్రెస్ పెద్దలే ఈ విధంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎలా దిగి వస్తుందని ప్ర శ్నించారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ కనకాల శ్యాం కుర్మా తదితరులు పాల్గొన్నారు.