calender_icon.png 24 August, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగుతున్న ఐటీ దాడులు

22-08-2025 02:05:01 AM

  1. మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి నివాసంలో తనిఖీలు

కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం 

హైదరాబాద్, సిటీ బ్యూరో ఆగస్టు 21 (విజయ క్రాంతి): హైదరాబాద్‌లో ఆదాయపు పన్ను శాఖ ఐటీ అధికారుల సోదాలు మూడో రోజూ కొనసాగుతున్నాయి. ప్రము ఖ నిర్మాణ రంగ సంస్థ ఎస్‌ఆర్ గ్రూప్స్‌తోపాటు, ఆ సంస్థ ఎండీ తిరుపతి రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలే లక్ష్యంగా ఈ తనిఖీలు గురువారం కూడా ముమ్మరంగా సాగాయి.

పన్ను ఎగవేత, అనుమానాస్పద లావాదేవీల ఆరోప ణల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు ఏకధాటిగా కొనసాగుతున్నాయి. పదుల సంఖ్యలో ఐటీ బృందాలు ఏకకాలంలో ఎస్‌ఆర్ గ్రూప్స్ ప్రధాన కార్యాలయంతో పాటు, సంస్థ డైరెక్టర్లు, ఎండీ తిరుపతి రెడ్డి నివాసాల్లో తనిఖీ లు నిర్వహిస్తున్నాయి. ఈ సోదాల్లో భాగం గా అధికారులు కీలక పత్రాలను, కంప్యూటర్ హార్డ్ డిస్క్లను,

ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో భాగంగా, ఎస్‌ఆర్ గ్రూప్స్‌కి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి ఉన్న ఆర్థిక సంబంధాలపై ఐటీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన నివాసంలోనూ మూడో రోజు సో దాలు కొనసాగిస్తున్నారు. మూడు రోజులు గా నిర్విరామంగా కొనసాగుతున్న ఈ ఐటీ దాడులు నగరంలోని రియల్ ఎస్టేట్, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మా రాయి. సోదాలు పూర్తయితే గానీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం లేదు.