calender_icon.png 24 August, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం రేవంత్

24-08-2025 11:58:35 AM

హైదరాబాద్: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి(Suravaram Sudhakar Reddy) భౌతికకాయానికి సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్ నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాళులర్పించారు. ఆయన వెంట మంత్రి సీతక్క కూడా పాల్గొని నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, రాజీపడని సిద్దాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత సురవరం సుధాకర్ రెడ్డి అని పేర్కొన్నారు. విద్యార్థి నేత నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగారని, పాలమూరు జిల్లా బిడ్డ జాతీయ స్థాయి నేతగా ఎదగటం గర్వకారణమని తెలిపారు. పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చిన గొప్పనేతల్లో సురవరం ఒకరని, అధికారం ఉన్నా.. లేకున్నా తన సిద్దాంతాలను ఎప్పుడూ వీడలేదని అన్నారు. సురవరం కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని, సురవరం సుధాకర్ రెడ్డి జ్ఞాపకార్థం ఏదనా చేపడతామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప నేతల పేర్లను పలు సంస్థలకు పెట్టిందని, సురవరం సుధాకర్ రెడ్డి సేవలనూ అందరూ స్మరించుకునేలా చేస్తామని అన్నారు.