calender_icon.png 24 August, 2025 | 5:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్ధార్థలో బీటెక్ విద్యార్థులకు ఓరియంటేషన్

22-08-2025 02:07:44 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 21 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థు లకు గురువారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం చీఫ్ పీఆర్‌వో డాక్టర్ జీ మల్సూర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు ఇప్పటివరకు గడిపిన జీవితం వేరని, ఇక నుంచి ఇప్పటినుంచి గడిపే జీవితం వేరని చెప్పారు.

ఇంజినీరింగ్ విద్య జీవితాలనే మార్చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చక్కగా విద్యనభ్య సించిన వారు గొప్ప ఇంజినీర్లుగా స్థిరపడతారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ దేశ మౌలిక పరిస్థితులను మార్చే గొప్ప సాధనంగా మారాయని చెప్పా రు. అనంతరం కాలేజీ చైర్మన్ డాక్టర్ జీ నాగ య్య మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా కాలేజ్ సాధించిన విజయాలను గుర్తు చేశా రు. 

విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ అంటే కేవలం పుస్తకాలు, ఎగ్జామ్స్ మాత్రమే కాదని, సృజనాత్మకంగా ఆలోచించడమన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.శేఖర్ బాబు నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ కళాశాల ప్రాముఖ్యతను, కళాశాలలో నిర్వహిస్తున్న కోర్సుల వివరాలను విద్యార్థులకు వివరించారు.

డైరెక్టర్ జీ భగత్ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు శివాని రెడ్డి, మైలారం శ్యామ్, హరహర హిత, మనోజ్ ఆకుల, గుంజన్ వర్షిణి అభి సాగర్ ఐఈఈఈ వైఈఎస్‌ఐఎస్‌టీ12 2కె25 కార్యక్రమంలో పాల్గొని ‘సేఫ్‌గార్డ్: విమెన్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్’ అనే అంశంపై అబ్‌స్ట్రాక్ట్ సమర్పించినట్టు గుర్తు చేశారు. విదేశాల్లో జరిగే కార్యక్రమాల్లోనూ వీరు పాల్గొం టున్నట్టు వెల్లడించారు.

కళాశాల వైస్ ప్రిన్సిపల్, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ డీ సుబ్బా రావు మాట్లాడుతూ యువత భవితకు మా ర్గాలు వేయాలని హితవు పలికారు. కార్యక్ర మ నిర్వాహకులను కళాశాల సెక్రటరీ డాక్టర్ డీ ప్రదీప్ కుమార్ అభినందించారు.ఈ కార్యక్రమంలో మొదటి సంవత్సరం హెచ్‌వోడీలు డాక్టర్ మారగోని వెంకటేశం, డాక్టర్ టీ కృష్ణార్జునరావు తదితరులు పాల్గొన్నారు.