calender_icon.png 24 August, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిఆర్ఎస్ నాయకునిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

24-08-2025 12:01:00 PM

అభివృద్ధిని మరిచి దాడులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులు

దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ 

దేవరకొండ: నల్గొండ జిల్లా డిండి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు కడారి పెద్దయ్యపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్(Former MLA Ramavath Ravindra Kumar) డిమాండ్ చేశారు. ఆదివారం కాంగ్రెస్ గుండాల చేతిలో గాయపడిన డిండి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన కడారి పెద్దయ్యను దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వారు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బిఆర్ఎస్ పార్టీ నాయకుల జోలికి వస్తే ఊరుకోం అని కాంగ్రెస్ నాయకులకు వారు హెచ్చరించారు.

బిఆర్ఎస్ కార్యకర్తలలో అభద్రతా భావాన్ని పెంచేందుకు పన్నిన కుట్రలో భాగంగానే దాడులు చేయడం జరిగింది అని, ఈ కుట్రలు బిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మస్థైర్యంను దెబ్బతియలేవు అని,పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా అని వారు భరోసా ఇచ్చారు.గ్రామాలలో అభివృద్ధి చేయకుండా దాడులకు కాంగ్రెస్ నాయకులు పాల్పడుతున్నారు అని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బిఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడులు చేయడం దారుణం అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని వారు తెలిపారు.