ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటేయండి
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేపీ, కౌశిక్‌రెడ్డి పిటిషన్లు
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): స్టేషన్ ఘన్‌పూర్, ఖైరతాబాద్, భద్రాచలం నియోజకవర్గాల నుంచి బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచి న కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకటరావు కాంగ్రెస్‌లో చేరిన కారణంగా ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలపై హైకోర్టు స్పం దించింది. ఆ ముగ్గురిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే అసెంబ్లీ కార్యాలయ సిబ్బంది అనుమతించడం లేదని బీఆర్‌ఎస్ ఎమ్మె ల్యేలు కేపీ వివేకానంద్, పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై గురువారం జస్టిస్ విజయసేన్‌రెడ్డి విచారణ జరిపారు. పిటీషనర్ల ఫిర్యాదుకు చెందిన అదనపు అఫిడవిల్‌ను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి అందజేయాలని ఉత్తర్వులు జారీచేశారు. స్పీకర్ కార్యాలయం అఫిడవిట్లను స్వీకరించిన తర్వాత ధ్రువీకరణ చేయాలని ఆదేశించారు. విచారణను 29కి వాయిదా వేశారు.






