calender_icon.png 17 February, 2026 | 11:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లిం మైనారిటీ కౌన్సిలర్ల అసంతృప్తి.!

17-02-2026 09:48:20 AM

రాజీనామాలకు సిద్ధమైన ఇద్దరు మైనారిటీ కౌన్సిలర్లు.!?

పదవులు దక్కకపోవడంఫై అసంతృప్తి. 

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): మున్సిపాలిటీలో ముస్లిం మైనారిటీ కౌన్సిలర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు ముస్లిం అభ్యర్థుల్లో 24వ వార్డు నుంచి రెండోసారి గెలిచిన మహమ్మద్ నిజాంకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవి దక్కుతుందని మైనారిటీ వర్గం ఆశించింది. అందుకు అ వర్గం కార్యకర్తలు ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డిని కలిసి కోరినట్లు సమాచారం.కాగా సోమవారం నిర్వహించిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్బంగా సీల్డ్ కవర్‌లో చైర్మన్‌గా తీగల సునీంద్ర, వైస్ చైర్మన్‌గా బాదం రమేష్ పేర్లు ప్రకటించడంతో మైనారిటీ నాయకులు నిరాశకు గురైనట్లు తెలిసింది.

చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తికాగానే 24 వ వార్డు కౌన్సిలర్ నిజాం అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారు. అనంతరం కౌన్సిలర్లు ఎంత పెద్దలను కలిసిన క్రమంలోనూ అదే వర్గానికి చెందిన 15వ వార్డు కౌన్సిలర్ అక్కడినుండి ప్రత్యక్షమయ్యారు. అనంతరం ఆ ఇద్దరు కౌన్సిలర్లు పదవి రాలేదన్న నిరాశతో రాజీనామాకు కూడా సిద్ధమై మున్సిపల్ కమిషనర్‌ను సంప్రదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు గెలుపొందిన కౌన్సిలర్ల మెజారిటీ సీట్ల ఆధారంగా కొల్లాపూర్ కల్వకుర్తి మున్సిపాలిటీలలో తగిన ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ నాగర్కర్నూల్ లో మాత్రం మొండిచేయి చూపారని ఆవేదనకు గురవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.