calender_icon.png 12 September, 2025 | 12:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కట్టిన ఇండ్లనైనా పంపిణీ చేయండి

06-12-2024 12:00:00 AM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తవుతున్న వేళ విజయోత్సవాలు సైతం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ, గత ప్రభుత్వం కట్టిన డబ్బుల్ బెడ్‌రూమ్స్ ఇంతవరకు పంపిణి చేయకపోవడం అన్యాయం. వాటిని వేరే వారు అక్రమంగా ఆక్రమించి ఉంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఆరెపల్లి, కమాన్ పూర్, చింతకుంట, ఎలగందుల, బహుపేట, ఖాజీపూర్‌లలో ఈ పరిస్థితి కనిపిస్తున్నది. డబుల్ బెడ్‌రూమ్స్ ఇండ్లను ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా లబ్ధిదారులు పంపిణి చెయ్యాలి. అలాగే, ఆయా గ్రామాలలో స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదు. ఎక్కడి చెత్త అక్కడనే ఉంటున్నది.

అనేక ఊళ్లు, పట్టణాలలో దోమలు, కోతుల బెడదకూడా బాగా పెరిగింది. ఇటీవలే చిరు వ్యాపారం చేసుకొనే బీదవారి కోసం కట్టిన గదులను కూడా వెంటనే పంపిణి చేయాలి. గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నాయి కూడా. మరోవైపు కరీంనగర్ కార్పొరేషన్‌లో పరిసరాల గ్రామ పంచాయతీల విలీన ప్రక్రియ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. స్థానిక నాయకులు అలసత్వం వీడి కనీస సౌకర్యాల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి.

 -సింగు లక్ష్మీనారాయణ, చింతకుంట