24-12-2025 08:41:44 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): వాగేశ్వరి డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ చెన్నోజు రమణాచారి-సంధ్య రాణి కుమార్తె రియాన్షి జన్మదినాన్ని పురస్కరించుకొని బైపాస్ రోడ్డులో గల వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధుల అనాథ ఆశ్రమంలో పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాగేశ్వరి మహిళా కళాశాల ప్రిన్సిపల్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... జన్మదినాలు కేవలం ఆనందోత్సవాలకే పరిమితం కాకుండా సమాజానికి సేవ చేసే సందర్భాలుగా మలచుకోవాలని అన్నారు. చిన్న వయసులోనే పిల్లల్లో తల్లిదండ్రుల పట్ల గౌరవం, పెద్దల పట్ల ఆదరణ, సమాజంపై బాధ్యతాభావం పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు పిల్లలలో మానవత్వం, దయ, సేవా భావాలను పెంచుతాయని తెలిపారు.