14 July, 2026 | 4:50 AM

విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

14-07-2026 12:00 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూలై 13: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పీహెచ్సీ అర్వపల్లి ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు,కేజీబీ వీ,అంగన్వాడీలలో చదువుతున్న 2410 మంది విద్యార్థులకు గాను 2276 మంది వి ద్యార్థులకు ఆల్బెండజోల్ 400 ఎంజీ మా త్రను మింగించారు. ఈ సందర్భంగా మం డల వైద్యాధికారి నగేష్ నాయక్ మాట్లాడు తూ ఒకటి నుంచి 18సంవత్సరాల లోపు బా ల బాలికల్లో పరాన్నజీవి ద్వారా సంక్రమించే నులిపురుగులు,కొంకి పురుగులు,ఏలిక పా ముల నివారణకు ప్రతీ ఒక్కరు మాత్రను వేసుకోవాలని,ఈ మాత్రలు పిల్లలు ఆరోగ్యానికి,ఏకాగ్రతకు దోహదపడతాయని అన్నా రు. ఆయా కార్యక్రమాల్లో సీహెచ్‌ఓ బిచ్చునాయక్,హెచ్‌ఎంలు మల్లేశం, పురుషోత్తం, విమల కుమారి,హెల్త్ సూపర్వైజర్ లలిత, కుంభం వీరయ్య, సైదమ్మ, శకుంతల,ఆరోగ్య సిబ్బంది,ఆశాలు తదితరులు పాల్గొన్నారు.