09-02-2025 07:05:29 PM
మునగాల: మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో ఈవిఆర్ డిగ్రీ 1999 నుంచి 2002 వరకు విద్య నభ్యసించిన పూర్వ విద్యార్థులు ఇటీవల సమ్మేళన కార్యక్రమం నిర్వహించి నాటి నుంచి నేటి వరకు వివిధ ప్రాంతాలలో ఉద్యోగ వ్యాపార వాణిజ్య వ్యవసాయ రంగాలలో ఉన్నవారు అంతా కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి సమాజానికి తమ వంతుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏదో ఒక రకంగా సహాయ సహకారాలు అందించాలన్న దృక్పథంతో నేడు ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు అనాధలకు మానసిక వికలాంగులకు వారి ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఇలాంటి ఆశ్రమాలలో ఉన్న నిరాధారణకు గురైన అనాధలకు వృద్ధులకు మానసిక వికలాంగులకు అన్న వితరణ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని భవిష్యత్తులో తమ తమ గృహాలలో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా ఇలాంటి ఆశ్రమాలలో అన్నదాన కార్యక్రమంతో పాటు వారికి అవసరమైన వివిధ రకాల సదుపాయాలను కల్పిస్తామని భవిష్యత్తులో ఈ ఆశ్రమానికి మా గ్రూపు సభ్యుల ద్వారా అవకాశమున్నంతవరకు మా సహాయ సహకారాలు అందిస్తామని అలాగే ప్రతి ఒక్కరు సామాజిక సేవా దృక్పథంతో ముందుకు వచ్చి సమాజ సేవలో ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డు శ్రీనివాసరావు పోకల వీరబాబు మల్లు సురేందర్ రెడ్డి, సిహెచ్ కిషోర్ కుమ్మరి శేషగిరి, పసుపులేటి నాంచారయ్య, నరసింహ చారి, సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ, యలమంచిలి శ్రీనివాసరావు, ఆశ్రమం నిర్వాహకులు నాగిరెడ్డి విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.