09-02-2025 07:20:10 PM
మునగాల: కోదాడ నియోజకవర్గం మునగాల మండల కేంద్రములో లకూవరపు రత్నామాల జీవితం నేటి తరానికి ఆదర్శం అని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అన్నారు. వాసవి భవన్ లో అప్పారావు అధ్యక్షతన స్వర్గీయ లకుమారపు రత్నామాల ప్రథమ వర్ధంతి సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ... సానుభూతిపరాలు రత్నామాల సమాజంలో ఆమె చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేకంగా కామ్రేడ్ బుర్రి శ్రీరాములు తన పాటలతో సమాజంలో జరుగుతున్న సంఘటనలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లపాటి శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ లు కందిబండ సత్యనారాయణ, చందా చంద్రయ్య, కళాకారులు కుడుముల ఏడుకొండలు, రాంబాబు, సాయి, కళ్యాణ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.