calender_icon.png 22 November, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఎన్టియుసి బలోపేతానికి కృషి చేయాలి

09-02-2025 07:01:01 PM

ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ ప్రసాద్..

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి వ్యాప్తంగా కాంగ్రెస్ అనుబంధం ఐఎన్టియుసి యూనియన్ బలోపేతం చేసి రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచేలా కృషి చేయాలని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ కోరారు. ఆదివారం తనను కలిసిన యూనియన్ నాయకులతో ఆయన మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా యూనియన్ను బలోపేతం చేసి కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

ఐఎన్టియుసి కేంద్ర కమిటీ జాయింట్ సెక్రెటరీగా జగన్నాథ చారి నియామకం కాగా, యూనియన్ ఏరియా ఉపాధ్యక్షులు దేవి భూమయ్య ఆద్వర్యంలో నాయకులు జనక్ ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాంశెట్టి నరేందర్, జంగ శ్రీనివాస్, ఎస్అండ్ పిసి పిట్ సెక్రెటరీ కె ఆర్ సంపత్, పత్తి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.