14 April, 2026 | 5:14 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

శ్రీ సత్యసాయిబాబా శతజయంతి సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో దుప్పట్లు, పండ్ల పంపిణీ

24-11-2025 12:09 AM

సుల్తానాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): శ్రీ సత్య సాయి బాబా 100 వ జయంతి నీ పురస్కరించుకొని ఆదివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో పేషంట్ల కు దుప్పట్లు, పండ్లు, బ్రెడ్లు, డోర్ మ్యాట్లు పంపిణీ చేయడం జరిగింది...పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ ఆవరణలో గల వాసవి మాత దేవాలయం లో ముందు గా సత్య సాయి బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం  భజనలు చేయడం జరిగింది... ఆర్యవైశ్య భవన్ నుండి ద్విచక్ర వాహనాల ర్యాలీ తో పోలీస్ స్టేషన్ మీదుగా ఆసుపత్రి వరకు చేరుకోవడం జరిగింది.

లాలపల్లి వాస్తవ్యులు క్రీస్తు శేషులు అల్లెంకి సుశీల-భూమయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు బంధువుల తోపాటు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగ గా నిర్వహించడం జరిగింది... ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడు తూ పుట్టపర్తి సాయిబాబా 100వ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు... ఆ స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకోవడం జరిగింది... ఈ కార్యక్రమంలో ఆస్పత్రి డాక్టర్.. సిబ్బంది , ఆర్యవైశ్య సంఘం నాయకులు.. సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు....