24-11-2025 12:09:14 AM
-సత్య సాయిబాబా ఎఐ వీడియో పాటల ఆల్బమ్ విడుదల చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
-విడుదలైన కొన్ని నిమిషాల్లోనే వీడియోలు వైరల్
ముషీరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): సౌభాగ్య చిత్ర నిర్మించిన ’శ్రీ సత్య సాయిబాబా-మై లైఫ్ ఈజ్ మై మెసేజ్’ ఆల్బమ్ కోసం హైదరాబాద్ కు చెందిన ఈస్ట్ ఎఫ్‌ఎక్స్ మీడియా కమ్యూనికేషన్ విభాగం మ్యూజిక్ ఎఫ్‌ఎక్స్ రూపొందించిన ‘ఎఐ వీడియో పాటల ఆల్బమ్’ను పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీసత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవి ష్కరించారు.
ఈ సందర్బంగా సిఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ ఆధ్యాత్మిక గురువు శ్రీసత్యసాయి బాబాను డిజిటల్ గా ‘తిరిగి జీవం పోయడానికి‘ అధునాతన కృత్రిమ మేధస్సును ఉపయోగించి భారతదేశంలోని అతిపెద్ద సంగీత దిగ్గజాలు ప్రదర్శించిన భక్తి పాటలతో నవీకరిం చిన ఎఐ-సృష్టించిన వీడియో ఇమేజరీ అద్భుతంగా ఉందని కొనియాడారు.
సాం స్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఎలా కాపాడుకోగలదో చెప్పడానికి ఈ ప్రాజెక్టు ఒక అద్భుతమైన ఉదాహరణ అని ఆయన ప్రశంసించారు. ‘ఇది సాంకేతికత, సంప్రదాయాల కలయికను ఉదహరిస్తుందన్నారు. ఆధునిక డిజిటల్ తరానికి కాలాతీత సందేశాలను అందుబాటులోకి తెస్తుంది’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టును ప్రపంచంలోనే మొట్టమొదటి విజయంగా ఆయన అభివర్ణించారు. సత్య సాయి బాబా ను ఎప్పుడూ చూడని యువతరానికి ఆయ న ఉనికిని తెలియజేయడానికి, ఆయన ఆధ్యాత్మికను అనుభవించడానికి వీలు కల్పించిందన్నారు. ఈస్ట్ ఎఫ్ మీడియా కమ్యూనికేషన్ విభాగం మ్యూజిక్ ఎఫ్‌ఎక్స్ ప్రతినిధి నివేదిత సౌతేకల్ మాట్లాడుతూ 2011లో మరణించిన ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీసత్యసాయి బాబా దృశ్య ఉనికిని పునఃసృష్టించడానికి అత్యాధునిక ఎఐ సాంకేతికతను ఉపయోగించి రూపొందించిన ఈ మ్యూజిక్ వీడియో తన శత జయంతి వేడుకల సందర్భంగా ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందన్నారు.
‘టోక్యో నుండి టొ రంటో వరకు, ముంబై నుండి మెక్సికో సిటీ వరకు, ఎవరైనా ఇప్పుడు ఈ పాటలను వారు ఇష్టపడే ప్లాట్ యాక్సెస్ చేయవచ్చు‘ అని ఆమె తెలిపారు. అన్ని ట్రాక్ eastfx.in/saibaba సైట్ పేరుతో ఉన్న ప్రత్యేక హబ్ ద్వారా కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సౌభాగ్య చిత్ర నిర్మాత కరటం రమేష్ సహ నిర్మాత వంశీ కరటం, క్రియేటర్ ప్రొడ్యూసర్ స్వప్నేష్ చింతల, మ్యూజిక్ ఎఫెక్ట్ బృందం సభ్యులు వైష్ణవి హైదనూరు, మహ్మద్ అన్వర్, నరేష్ శామర్థి పాల్గొన్నారు.