22-11-2025 12:00:00 AM
ఎల్లారెడ్డి, నవంబర్ 21 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లోని ఆయా గ్రామాలకు చెందిన అత్యంత నిరుపేద , బీద పరిస్థితిలో ఉన్న ఐదు కుటుంబాల వారికి బ్లాంకెట్స్, స్వెటర్స్ శుక్రవారం మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. వర్డ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి. సాయిబాబా (కమ్యూనిటి కో ఆర్డినేటర్) హాజరై వర్డ్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు గురించి వివరించారు.
నిరుపేదలను ఆదుకోవడంలో వర్డ్ సంస్థ ముందుంటుందని తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులను గుర్తించామని వారికి , ప్రస్తుతం చలి కాలం కావడంతో బ్లాంకెట్స్, స్వేటర్స్ అవసరం ఉంది అని గ్రహించి మండల సమాఖ్య సమావేశంలో పంపిణీ చేసినట్లు తెలిపారు.
మండల మహిళా సమాఖ్య కార్యవర్గం, సభ్యులు సిబ్బంది స్పందించి ,తక్షణమే (తలా ఒకరు తమకు తోచిన సహాయాన్ని) విరాళాన్ని సేకరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తా హసిల్దార్ ప్రేమ్ కుమార్, ఏపిఎం రామ్ నారాయణ గౌడ్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పావని చేతుల మీదుగా పంపిణీ చేశారు. వర్డ్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది సాయిబాబా, ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.